శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (12:34 IST)

ప్రధాని నరేంద్ర మోదీ.. విష్ణుమూర్తి 11వ అవతారమట..?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా ప్రధాని మోదీని విష్ణుమూర్తి అవతారంగా పేర్కొంటూ మహారాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతోంది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా ప్రధాని మోదీని విష్ణుమూర్తి అవతారంగా పేర్కొంటూ మహారాష్ట్ర బీజేపీ నేతలు చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ విష్ణు మూర్తి 11వ అవతారం అంటూ మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఘ్‌ ట్వీట్‌ చేశారు. కానీ ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 
 
మరోవైపు బీజేపీ నేతల వైఖరిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దేవుళ్లను అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
కమలం నేతల వ్యాఖ్యలు చౌకబారు రాజకీయాలకు ప్రతీక అంటూ మండిపడుతున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌గా చెప్పుకునే వాఘ్..ఇలాంటి మాట్లాడడమేంటని విరుచుపడుతున్నారు. కానీ తన ట్వీట్‌పై అవధూత్‌ వాఘ్‌ మాత్రం సమర్థించుకుంటున్నారు. దేశానికి దేవుడి లాంటి ప్రధాని దొరకడం అదృష్టమని మరోసారి స్పష్టం చేశారు.