శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు పూజ.. ఎందుకు?
స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య స
స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్న వేళ మూడు రంగుల దారాలు.. అంటే పసుపు, కుంకుమ, తెలుపు దారాలను ఏడు పేటల వత్తిగా చేసి మట్టి ప్రమిదలలో వేసి నెయ్యి, నూనె, ఆముదము కలిపి పోసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అపమృత్యుదోషం తొలగిపోతుంది. అనారోగ్యాలు దరిచేరవు.
ఏ రోజు కోసిన పువ్వుల్నే ఆ రోజు పూజకు ఉపయోగించాలి. ఇతరుల చెట్లు, మొక్కల్లోని పుష్పాలు తెచ్చుకుని పూజ చేసినట్లైతే.. పూజా ఫలము వారికే దక్కుతుంది. విష్ణువును తులసీ దళంతో అర్చించాలి. ఆలయంలో తీసుకునే తీర్థాన్ని కుడిచేతిలో మాత్రమే తీసుకోవాలి. దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని.. ఇతర పనులకు ఉపయోగించరాదు.
దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు చేయాలి. ఎదురుగా మాత్రం చేయకూడదు. గోపూజ చేసేటప్పుడు ముందుగా తోకకు పూజ చేయాలి. శివాలయంలోలోకి నందీశ్వరుడిని ప్రార్థించిన తర్వాతే శివునిని ఆరాధించాలి.