శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (14:03 IST)

సప్తముఖి రుద్రాక్ష మాలను ధరిస్తే?

రుద్రాక్ష ధారణ పరమశివునికి చాలా ప్రీతికరమైనది. శనిదోష ప్రభావాన్ని తగ్గించే శక్తిని కలిగిన రుద్రాక్షగా సప్తముఖి రుద్రాక్షను చెప్తారు. సాఫీగా సాగిపోతోన్న జీవితాన్ని శనిదోషం ఎంతోగానో ప్రభావితం చేస్తుంది.

రుద్రాక్ష ధారణ పరమశివునికి చాలా ప్రీతికరమైనది. శనిదోష ప్రభావాన్ని తగ్గించే శక్తిని కలిగిన రుద్రాక్షగా సప్తముఖి రుద్రాక్షను చెప్తారు. సాఫీగా సాగిపోతోన్న జీవితాన్ని శనిదోషం ఎంతోగానో ప్రభావితం చేస్తుంది. ఎవరి సాయం లేకుండా ఆశించిన ప్రయోజనాలు నెరవేరకుండా రకరకాల సమస్యలతో భాదపడుతుంటారు.
 
ఎవరికైనా శనిపేరు వినగానే అలజడి మెుదలవుతుంది. అలాంటి శనిదోష ప్రభావం నుండి బయటపడాలంటే సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. లక్ష్మీదేవి స్వరూపంగా, మన్మథ స్వరూపంగా, సప్తమాతృకలు, సప్తపురషులకు ప్రతీకగాను ఈ రుద్రాక్ష మాలను చెబుతుంటారు. ఈ రుద్రాక్షను ధరించడం వలన ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. 
 
ఈ రుద్రాక్ష మాలను ధరించడం వలన శనిదోషాలే కాకుండా, ప్రమాదాలు, విష బాధలు, దారిద్ర్యం వంటి సమస్యల నుండి బయటపడుతారని స్పష్టం చేయబడుతోంది. రుద్రాక్ష మాల ఏదైనా దాని నియమనిష్టలను పాటిస్తూ దానిని పవిత్రంగా చూసుకున్నప్పుడే ఆశించిన ఫలితాలను పొందుతారు.