ఆ 10 రోజులు తిరుమలకు వస్తే ఇబ్బందులే... గోకులాష్టమి వేడుక...
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ యేడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశముంది. అందుకే టిటిడి ఉన్నతాధికారులు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి 21 వరకూ తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
నిత్యమూ వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు వయసున్న చిన్న పిల్లల తల్లిదండ్రులు, దాతలకు కల్పించే దర్శనాలను కూడా రద్దు చేశామని పేర్కొంది. భక్తులు సహకరించాలని కోరింది. కాగా, 3వ తేదీన గోకులాష్టమి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకూ ఆస్థానం వేడుకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది.