సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:44 IST)

తిరుమలలో ఓ యువతి ఎంత పనిచేసిందో తెలుసా?

తిరుమలలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సమయానికి తితిదే అధికారులు ఆ యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నీరజ.. కుటుంబసభ్యులతో గొడవపడింది.

తిరుమలలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సమయానికి తితిదే అధికారులు ఆ యువతిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నీరజ.. కుటుంబసభ్యులతో గొడవపడింది. తిరుమలలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.


ఈ క్రమంలో మొదటి ఘాట్ రోడ్డులోని మోకాళ్లమిట్ట సమీపంలో ఉన్న అవ్వాచారికోన లోయ ముందు నిలబడి, సెల్ఫీ ఫొటో తీసుకుని, దాన్ని వాట్సాప్‌లో పోలీసులకు పంపి దూకేసింది. ఆ సెల్ఫీని చూడగానే అలెర్టయిన పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, ఆ ప్రాంతానికి వెళ్లారు. 
 
దాదాపు 60 అడుగుల లోతులోకి పడిపోయిన నీరజను గుర్తించి, బయటకు తెచ్చారు. తొలుత అశ్విని ఆసుపత్రిలో, ఆపై మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించారు. ఆపై జగ్గయ్యపేట పోలీసులకు సమాచారం ఇవ్వగా, సదరు యువతి, రెండు రోజుల క్రితమే తప్పిపోయినట్టు ఫిర్యాదు నమోదైందని తెలిసింది. మూడేళ్ల క్రితం నీరజకు వివాహం కాగా, ఇటీవల ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. గుడికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి, నేరుగా తిరుమలకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.