గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (12:09 IST)

అక్టోబరు 10 నుంచి తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు...

తిరుమల తిరుపతి దేవస్థానంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10వ తేదీ నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10వ తేదీ నుంచి ప్రారంభమై 18వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 9 రోజుల పాటు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
 
తిరుమలలో 9వ తేదీన విష్వక్సేనుని ఊరేగింపు, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, 18వ తేదీన జరిగే చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఈఓ అనిల్ సింఘాల్, అధికారులు భక్తులకు పలు కీలక సూచనలు చేశారు.
 
ఈ 9 రోజుల పాటూ సామాన్యులకు అద్దె గదులుండవని, గతంలో అద్దె గదుల నిర్మాణానికి నగదు సమర్పించిన భక్తులు స్వయంగా వస్తే మాత్రమే వారికి గదులుంటాయని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని సాధారణ భక్తులు అర్థం చేసుకోవాలని అధికారులు కోరారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ జరుగుతాయని అధికారులు వెల్లడించారు.