1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. TTD Member Krishnareddy driver escape with 1 crore money

కారులో టిటిడి పాలకమండలి సభ్యుడి కోటి రూపాయలు... డబ్బుతో డ్రైవర్ పరార్..?

ఒకటి రెండు కాదు కోటి రూపాయలు. డ్రైవర్ పైన నమ్మకంతో డబ్బును కారులోనే ఉంచారు. అయితే నమ్మిన వ్యక్తే కోటి రూపాయలతో ఉడాయించాడు. రెండు సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేసి చివరకు యజమానికే టోకరా వేశాడు. టిటిడి పాలకమండలి సభ్యుడు మేడా రామక్రిష్ణారెడ్డి కారు డ్రైవర

TTD Member Krishnareddy
ఒకటి రెండు కాదు కోటి రూపాయలు. డ్రైవర్ పైన నమ్మకంతో డబ్బును కారులోనే ఉంచారు. అయితే నమ్మిన వ్యక్తే కోటి రూపాయలతో ఉడాయించాడు. రెండు సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేసి చివరకు యజమానికే టోకరా వేశాడు. టిటిడి పాలకమండలి సభ్యుడు మేడా రామక్రిష్ణారెడ్డి కారు డ్రైవర్ మల్లిఖార్జున్ కోటి రూపాయలతో పరారయ్యాడు. 
 
రామక్రిష్ణారెడ్డి కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాడు. ఆ పనికి సంబంధించిన రెండు బ్యాగులలో కోటిరూపాయల డబ్బును తీసుకుని కారులో కర్నూలుకు వచ్చారు. చీకటి కావడంతో అక్కడో గదిని అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్ కారులోనే పడుకున్నాడు. డబ్బును కూడా కారులో ఉంచేశారు. అయితే తెల్లవారుజామున వచ్చి చూసేసరికి డబ్బు సంచులు లేవు. కారు మాత్రం పార్కింగ్ ప్రాంతంలో ఉంది. దీంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
డ్రైవర్ మల్లిఖార్జున్‌కు ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తర్వాతి కథనం
అక్టోబర్ 20న ఆప్ఘన్ ఎన్నికలు.. కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 50 మంది మృతి