సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (16:55 IST)

విజయవాడలో 30 ఏళ్ల యువతి 16 యేళ్ళ యువకుడితో పరార్... భర్త, పిల్లల్ని వదిలేసి...

విజయవాడలో బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు.. ఆ సంఘటన మరిచిపోకముందే తాజాగా ఒంగోలులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి సంఘటనలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. సమాజంలో కొన్ని ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. హవ్వా అని ముక్కున వేలేసుకునేలా చే

విజయవాడలో బాలుడిపై మహిళ లైంగిక వేధింపులు.. ఆ సంఘటన మరిచిపోకముందే తాజాగా ఒంగోలులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి సంఘటనలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. సమాజంలో కొన్ని ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. హవ్వా అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. 
 
30 యేళ్ళ వయస్సున్న వివాహిత 16 యేళ్ళ కుర్రాడితో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కుర్రాడి కోసం కన్నపిల్లల్ని.. కట్టుకున్న భర్తను కూడా వదిలేసింది. అయితే గత ఐదురోజులుగా తమ పిల్లాడు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలుడు, వివాహిత పక్కపక్కన ఇంటిలో ఉంటున్నారు. ఇద్దరి మధ్య కొన్నిరోజులుగా సన్నిహిత సంబంధం ఏర్పడింది. అయితే నాలుగు రోజుల క్రితం ఆ మహిళ తన భర్తతో గొడవ పెట్టుకుంది. దీంతో ఆగ్రహించిన భార్య తను ఊరు వెళుతుంతానంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అదేరోజు నుంచి బాలుడు కూడా కనిపించలేదు. దీంతో ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఒక అంచనాక పోలీసులు వచ్చారు. ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.