శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (15:02 IST)

నన్ను చూడొద్దు.. నా సత్తా చూడండి.. : భారత రెజ్లర్‌గా కవిత

భారత తొలి మహిళా రెజ్లర్‌గా కవిత దలాల్ బరిలోకి దిగనున్నారు. ఈమె వయసు 31 యేళ్లు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగే రెజ్లింగ్ పోటీల్లో కవిత భారత తరపున బరిలోకి దిగనున్నారు. మెయి యంగ్ క్లా

భారత తొలి మహిళా రెజ్లర్‌గా కవిత దలాల్ బరిలోకి దిగనున్నారు. ఈమె వయసు 31 యేళ్లు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగే రెజ్లింగ్ పోటీల్లో కవిత భారత తరపున బరిలోకి దిగనున్నారు. మెయి యంగ్ క్లాసిక్ 2 పేరుతో ఈ నెలాఖరులో జరిగే మహిళా టోర్నమెంట్లో కవిత పాల్గొననున్నారు. భారత్ నుంచి తొలి రెజ్లర్‌గా కవిత పాల్గొంటుడటం దేశంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్రాన్ స్ట్రోమ్యాన్ అభిప్రాయపడ్డారు.
 
2017లో జరిగిన టోర్నమెంట్‌లోనే పాల్గొన్న కవిత చాంపియన్‌గా నిలిచారు. ఇక త్వరలో జరగబోయే ప్రపంచ టోర్నమెంట్లో పలు దేశాల నుంచి 32 మంది వీరవనితలు పాల్గొంటున్నారని, ఔత్సాహిక యువతులకు అవకాశం కల్పించేందుకు ట్యాలెంట్ హంట్ నిర్వహిస్తున్నామని, దీని కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.