మాజీ ఎమ్మెల్యే గండ్ర అలాంటివారా? ఆమెను శారీరకంగా వాడుకుని వదిలేశారా...

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ ఓ మహిళ ఆరోపణలుచేసింది. పైగా, గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, క

pnr| Last Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (09:48 IST)
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ ఓ ఆరోపణలుచేసింది. పైగా, గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాంగ్రెస్‌ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై కొమురెల్లి విజయలక్ష్మి రెడ్డి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. గండ్ర తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడంటూ ఆరోపించింది. మదర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా పనిచేస్తున్న విజయలక్ష్మి ఆదివారం హన్మకొండ వడ్డెపల్లిలోని జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద ధర్నా చేపట్టింది.

దీనిపై ఆమె స్పందిస్తూ, తాను స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో గండ్ర వెంకటరమణా రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అది చనువుగా మారిందని చెప్పింది. ఆయన గత ఐదేళ్లుగా తనను శారీరకంగా వాడుకున్నాడని, 4 రోజుల క్రితం వరకు తనతో చనువుగా ఉన్నాడని తెలిపింది. తాను ఈ నెల 3వ తేదీ రాత్రి ఆయనను కలిసేందుకు జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లానని, కానీ.. ఆయన పోలీసులకు సమాచారమిచ్చి అరెస్టు చేయించారని ఆరోపించింది.దీనిపై మరింత చదవండి :