సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (11:33 IST)

ఛాన్సిస్తాడని వాడేసుకుని సహజీవనం చేశాడు... దర్శకుడిపై మహిళ ఫిర్యాదు

టాలీవుడ్ దర్శకుడిపై ఓ మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినిమాలో ఛాన్సిస్తానని తనను బాగా వాడేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది.

టాలీవుడ్ దర్శకుడిపై ఓ మహిళ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సినిమాలో ఛాన్సిస్తానని తనను బాగా వాడేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడనీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత మరో యువతిని పెళ్లాడి తనకు మోసం చేశాడంటూ పేర్కొంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్‌నగర్‌లో నివసించే ఓ సినీనటి (40) నాలుగేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. గత ఫిబ్రవరిలో దర్శకుడు శ్రీదత్తుతో ఈమెకు పరిచయం ఏర్పడింది. ఆమె విడాకుల వ్యవహరం తెలుసుకున్న శ్రీదత్తు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. 
 
ఆమె వద్దనున్న 22 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీదత్తు మరో వివాహం చేసుకున్నాడని తెలియడంతో సదరు నటి.. వెళ్లి నిలదీసింది. 'ఇంతకీ నువ్వెవరు..?' అని అతను అడగడంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీదత్తుపై పోలీసులు కేసు నమోదు చేశారు.