మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (10:29 IST)

భావన లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది.. ఎలా?

మలయాళ నటి భావన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. లైంగిక వేధింపులకు పాల్పడిన మలయాళ హీరో దిలీప్‌పై ఉన్న నిషేధాన్ని అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) తొలగించింది.

మలయాళ నటి భావన లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. లైంగిక వేధింపులకు పాల్పడిన మలయాళ హీరో దిలీప్‌పై ఉన్న నిషేధాన్ని అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) తొలగించింది. అదేసమయంలో ఈ కేసు విచారణ కోసం మహిళా న్యాయమూర్తిని నియమిస్తామంటూ కేరళ సర్కారు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు.
 
దీంతో భావన లైంగిక వేధింపుల కేసు మలుపు తిరిగింది. అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) సభ్యులుగా ఉన్న హీరోయిన్లు హనీ రోజ్, రచనా నారాయణ కుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదనలు వినేందుకు మహిళా న్యాయమూర్తినే నియమించాలని కోరారు. ఇదేసమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ సైతం ఓ పిటిషన్‌ను దాఖలు చేయడంతో, రెండు పిటిషన్లనూ కోర్టు విచారణకు స్వీకరించింది.