బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (10:46 IST)

తొలి చూపులోనే ప్రేమించుకున్నాం.. వారం క్రితం పారిపోయాం.. ఈ ఫోటో ఎలా లీకైందో?

హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి.. అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన తొలి హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటించి.. బంపర్ హిట్ రికార్డులను తన

హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి.. అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన తొలి హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటించి.. బంపర్ హిట్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా ఓ పిక్‌పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
ఓ అభిమాని పోస్టు చేసిన ఫోటోపై సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్‌‌లో ఎడిట్‌ చేసిన ఫొటోను అల్లు అర్జున్‌ అడిక్ట్‌ అనే ట్విట్టర్ అకౌంట్‌‌లో పోస్ట్ చేసి ఏంటిది.. అంటూ కామెంట్ చేశారు. ఈ ఫొటోపై స్పందించిన సమంత తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.
 
సమంత ఇచ్చిన సమాధానంపై సినీ ప్రముఖులు సరదాగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫోటోపై చైతూ ఎలా ఫీలవుతాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో ఏంటో మీరూ ఓ లుక్కేయండి.