ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (15:13 IST)

ఆదా శర్మ 'కికీ' ఛాలెంజ్ వీడియో వైరల్

సినీ నటి ఆదా శర్మకు సినీ అవకాశాలు చాలా మేరకు తగ్గిపోయాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా చేసుకుని చిత్ర విచిత్ర వీడియోలను పోస్ట్ చేస్తూ మంచి పబ్లిసిటీని కొట్టేస్తున్నారు. తాజాగా ఆమె 'కికీ' ఛాలెంజ్ పేరుతో

సినీ నటి ఆదా శర్మకు సినీ అవకాశాలు చాలా మేరకు తగ్గిపోయాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా చేసుకుని చిత్ర విచిత్ర వీడియోలను పోస్ట్ చేస్తూ మంచి పబ్లిసిటీని కొట్టేస్తున్నారు. తాజాగా ఆమె 'కికీ' ఛాలెంజ్ పేరుతో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.
 
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. ఆమె రిలీజ్ చేసిన వీడియోలో హిప్‌హాప్, భరతనాట్యం, కథక్‌కి సంబంధించిన బిట్స్‌ను ప్రదర్శించింది. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రదర్శించి ఆదా.. తన వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది. ఈ వీడియోలో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియో కొన్ని గంటల్లోనే సుమారు ఆరున్నర లక్షల వ్యూస్‌ను రాబట్టింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆదాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 
 
ఈ వీడియోలో తాను వ్యక్తం చేసిన హావభావాలపై ఆదా శర్మ కూడా స్పందించింది. తాను కథక్ రాజేంద్ర చతుర్వేది నుంచి.. ఎక్స్‌ప్రెషన్స్ వైజయంతి మాలా నుంచి నేర్చుకున్నట్టు వివరణ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తన తండ్రి తనను డ్యాన్స్‌లు చూసేలా ప్రోత్సహించారని తెలిపింది. ఈ కారణంగానే తాను అలా డ్యాన్స్ చేసినట్టు తెలిపింది.