సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 జులై 2018 (16:48 IST)

ఈ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం... ఈ మంత్రాలు జపిస్తే చాలు(Video)

ఈ రోజు 11:45 నిమిషాలకు ఈ శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం తెల్లవారుజామున 2:43 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం కేతు గ్రస్త చంద్ర గ్రహణమని జ్యోతిష నిపుణులు వెల్లడించారు. కనుక

ఈ రోజు 11:45 నిమిషాలకు ఈ శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం తెల్లవారుజామున 2:43 గంటల వరకు కొనసాగుతుంది. ఈ చంద్రగ్రహణం కేతు గ్రస్త చంద్ర గ్రహణమని జ్యోతిష నిపుణులు వెల్లడించారు. కనుక మకర రాశివారు ఈ గ్రహణాన్ని చూడరాదు. ఇక ఈ చంద్రగ్రహణ నియమాలు ఏమిటో తెలుసుకుందాం. గ్రహణ సమయంలో విష వాయువులు వెలువడతాయని జ్యోతిషంలో వుంది కనుక గ్రహణ సమయానికి 3 గంటల ముందు, 3 గంటల తర్వాత వరకూ ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదన్నది విశ్వాసం.
 
గ్రహణ సమయంలో "ఓం లక్ష్మీ నమో నమః'' అనే మంత్రాన్ని జపించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి. అంతేకాదు... సర్వం గంగాసమంతోయం సర్వే వ్యాస సమాద్విజాః అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని, 
 
ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శివకేశవులు ఆశీర్వదిస్తారు. ఫలితంగా గ్రహణ దోషాలు పోయి శుభాలు కలుగుతాయి. గ్రహణం తాలూకు విష వాయువులు ఇంట్లోకి రాకుండా వుండాలంటే రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడితే పోతుందన్నది విశ్వాసం. ఇక గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అంటే.... గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాత తలంటు స్నానం చేసి గుడికి వెళ్లి పూజ చేస్తే మంచిది. ఈ వీడియో చూడండి...