చంద్ర గ్రహణాన్ని కళ్లద్దాలు లేకుండా చూడొచ్చా?
చంద్ర గ్రహణాలపై ప్రపంచవ్యాప్తంగా పలు అపోహలున్నాయి. ఈ చంద్ర గ్రహణాన్ని కళ్లద్దాలతోనే చూడాలని చెబుతుంటారు. ఒకవేళ కళ్లద్దాలతో చూడకపోతే కంటిచూపు దెబ్బతింటుందని సమాచారం. అస్సలు ఈ చంద్ర గ్రహణాన్ని చూసేందుకు
చంద్ర గ్రహణాలపై ప్రపంచవ్యాప్తంగా పలు అపోహలున్నాయి. ఈ చంద్ర గ్రహణాన్ని కళ్లద్దాలతోనే చూడాలని చెబుతుంటారు. ఒకవేళ కళ్లద్దాలతో చూడకపోతే కంటిచూపు దెబ్బతింటుందని సమాచారం. అస్సలు ఈ చంద్ర గ్రహణాన్ని చూసేందుకు కళ్లద్దాలు అవసరం లేదని మరికొందరి మాట. మరి ఇందులో ఏది నిజమో? ఈ గ్రహణాన్ని చూడొచ్చా లేదా అనే విషయాన్ని నిపుణులు ద్వారా తెలుసుకుందాం.
జూలై 27న సంభవించనున్న సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూసేందుకు కళ్లద్దాల అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ గ్రహణంలో రెండు దిశలుంటాయి. మెుదటి దిశ, చంద్రుడిలోని కొంత భాగం నీడలోకి వస్తుందని, రెండవ భాగం చంద్రుడు భూమి నీడలో పూర్తిగా రావడం వలన చంద్ర గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది.
జూలై 27న శుక్రవారం ఏర్పడనున్న ఈ గ్రహణం 1.43 గంటల పాటు కొనసాగుతుందని వెల్లడైంది. ఈ గ్రహణంలో అంగారకుడు భూమికి దగ్గరగా రావడం వలన మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ గ్రహణం సందర్భంగా భూమిపై పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది చంద్రుడిపై పడటంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
ఈ గ్రహణంలో చంద్రుడు బ్లడ్‌మూన్‌గా దర్శనవిస్తాడు. అలానే సూర్యగ్రహణ సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటిచూపును కోల్పోయే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.