1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (15:48 IST)

చంద్రబాబును చూస్తే హిట్లరే సిగ్గుపడుతారు : భూమన కరుణాకర్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే హిట్లరే సిగ్గుపడుతారని తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేక హోదా విషయ

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చూస్తే హిట్లరే సిగ్గుపడుతారని తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బంద్‌లో పాల్గొన్న వైకాపా కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 
 
దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును చూస్తే హిట్లరే సిగ్గుపడుతారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రజలు ఆకాంక్షను పోలీసులతో ఉక్కుపాదంతో అనిచివేశారని మండిపడ్డారు. హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ది అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్కరోజైనా కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. అర్థరాత్రి కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజీకి సంబరాలు చేసుకుంది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. లోక్‌సభ సాక్షిగా చంద్రబాబు, బీజేపీ మిత్రబంధం బయట పడిందన్నారు. 
 
బంద్ ప్రారంభమైన కొద్ది సేపటికే వేలసంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన కారణంగా దుర్గరావు అనే కార్యకర్త గుండె పోటుతో మరణించాడని ఆరోపించారు. నగరి, తిరుపతిలో పోలీసులు మా కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టారని... మా పార్టీ కార్యకర్తలు... టీడీపీ ఎంపీలు సభలో మాట్లాడిన దానికంటే ఎక్కువగా హోదా అంశంపై మాట్లాడుతారన్నారు. చంద్రబాబు చేస్తే దీక్షలు.. మేము చేస్తే శిక్షలా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.