1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. BJP MLC Madhav comments on TDP no-confidence motion

టీడీపీ అవిశ్వాస తీర్మానం బెడిసికొట్టింది : బీజేపీ ఎమ్మెల్సీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా బెడిసికొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తిరుపతిల

BJP
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పూర్తిగా బెడిసికొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
 
వైసీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని... వారిపై ప్రజలలో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురదజల్లాలని చూశారన్నారు. అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును తెలుగుదేశం పార్టీ బజారుకు ఈడ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీ బంధానికి లోక్‌సభ వేదికగా నిలిచిందని విమర్శించారు. 
 
త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసత్యాలు సభలో ప్రస్తావించారని ఆరోపించిన ఆయన... ఆర్థిక మంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని... ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని ఆనయ స్పష్టం చేశారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? 24న రాష్ట్ర బంద్ : జగన్ ప్రకటన