సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (13:24 IST)

చంద్రగ్రహ దోషాలు తొలగిపోవడానికి ఇలా చేస్తే....

ఆకాశంలోని చంద్రుడు ఎప్పుడు చూసినా కొత్తగా, అందంగా కనిపిస్తాడు. ఆకాశమనే సరస్సులో తెల్లతామర తేలుతున్నట్లుగా కనిపించే చంద్రుడిని ఇష్టపడని వారుండరు. ఒంటరిగా ఉన్న సమయంలో చంద్రుడిని తోడు చేసుకుని కబుర్లు చె

ఆకాశంలోని చంద్రుడు ఎప్పుడు చూసినా కొత్తగా, అందంగా కనిపిస్తాడు. ఆకాశమనే సరస్సులో తెల్లతామర తేలుతున్నట్లుగా కనిపించే చంద్రుడిని ఇష్టపడని వారుండరు. ఒంటరిగా ఉన్న సమయంలో చంద్రుడిని తోడు చేసుకుని కబుర్లు చెప్పుకునే వాళ్లు చాలామంది. చీకటిపై చల్లని వెన్నెల పరుస్తూ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుడు కళలను సంతరించుకుని కనిపిస్తుంటాడు.
 
నవగ్రహాలలో రెండవ స్థానంలో దర్శనమిచ్చే చంద్రుడు, కర్కాటక రాశికి అధిపతిగా చెప్పబడుతోంది. చంద్రగ్రహ సంబంధమైన దోషాలతో బాధపడుతున్న వారు చంద్రుడుని శాంతింపజేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. చంద్రగ్రహ దోషాలు గలవారు అవమానాలను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువలన చంద్రుని అనుగ్రహాన్ని పొంది వాటి బారి నుండి బయటపడటానికి ఎవరి ప్రయత్నం వారుచేస్తే మంచిది. 
 
చంద్రగ్రహ సంబంధిత దోషాలతో బాధపడుతున్న వారు ముత్యం ధరించాలని, శంఖాన్ని దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. చంద్రుడిని తేనెతో చేసిన పిండిపదార్థాలు చాలా ఇష్టం. అందువలన పౌర్ణమి రోజున చంద్రునికి రాగిపాత్రలో నైవేద్యంగా సమర్పించాలని చెప్పబడుతోంది. భక్తిశ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన ఆయన సంతృప్తిచెంది శాంతిపజేస్తారు.