మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:47 IST)

ఏలినాటి-శనిదోషాలు తొలగిపోవడానికి... ఇలా చేస్తే....

శనిదోష ప్రభావం అనేక ఇక్కట్లకు, ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. శనిదేవుడు ఇచ్చే ప్రతికూల ఫలితాలు నానాబాధలు పెడుతుంటాయి. శనిదోష ప్రభావం మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది. సమస్యల సుడిగుండంలో పడవేస్తుంది. అం

శనిదోష ప్రభావం అనేక ఇక్కట్లకు, ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. శనిదేవుడు ఇచ్చే ప్రతికూల ఫలితాలు నానాబాధలు పెడుతుంటాయి. శనిదోష ప్రభావం మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది. సమస్యల సుడిగుండంలో పడవేస్తుంది. అందువలనే శనిదేవుడిని శాంతింపజేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.
 
ముఖ్యంగా పుష్యమాసంలో ఆయనని పూజించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి దేవతగా శనీర్వరుడు చెప్పబడుతున్నాడు. పుష్యమాసం అయనకి ప్రీతికరమైనదిగా స్పష్టం చేయబడుతోంది. అందువలన ఈ మాసంలో జరిపే పూజాభిషేకాల వలన స్తోత్రపఠనాల వలన ఆశించిన ఫలితం లభిస్తుంది.
 
సాధారణంగా శనిదోష నివారణకి సంబంధించిన ప్రయత్నాలలో భాగంగా జపము, దానము, రత్నధారణ కనిపిస్తుంటాయి. కొన్ని జపాలు, దానాలు శనిదేవుడిని ప్రసన్నుడిని చేస్తుంటాయి. అలాగే రత్నధారణ కూడా ఆయన అనుగ్రహం అందేలా చేస్తుంది. ఒక్కోగ్రహ సంబంధమైన దోషం నుండి బయటపడడానికి ఒక్కో రత్నాన్ని ధరించవలసి ఉంటుంది.
 
ఈ నేపథ్యంలో శనిదోష ప్రభావం నుండి బయడపడాలనుకునేవాళ్లు నీలమణి ధరించడం మంచిదని చెప్పబడుతోంది. ఇది శనిదేవునికి ప్రీతికరమైన రత్నంగా చెబుతారు. శనిదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతోన్నవాళ్లు నీలమణి ధరించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుందని ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గిపోతుందని స్పష్టం చేయబడుతోంది.