మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (18:17 IST)

శివునికి బిల్వ పత్రాలతో పూజలు ఎందుకు చేస్తారంటే?

పరమశివుడు దయా సముద్రుడు పిలిస్తే పలికే దైవం. దోసెడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు. సంతృప్తి చెందుతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికి బిల్వ పత్రాలతో ప్ర

పరమశివుడు దయా సముద్రుడు పిలిస్తే పలికే దైవం. దోసెడు నీళ్లతో అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజిస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు. సంతృప్తి చెందుతాడు. అలా సదాశివుడు అభిషేకానికే ఆనందించడానికి బిల్వ పత్రాలతో ప్రీతి చెందడానికి కారణం లేకపోలేదు. పూర్వం సముద్ర మథనం హాలాహలం పుట్టినప్పుడు సమస్త జీవులను కాపాడడం కోసం ఆయన ఆ విషాన్ని కంఠంలో బంధించాడు. ఆ కారణంగా ఆయన తల భాగమంతా వేడెక్కింది.
 
ఆయన శిరస్సు చల్లబడడం కోసం దేవతలంతా నీటితో అభిషేకం చేశారు. బిల్వ పత్రాలు చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. అందువలన దేవతలు వాటితో శివుడిని పూజించారు. అప్పుడు శివుడికి ఉపశమనం కలిగింది. అందువలన శివుడికి అభిషేకం బిల్వ పత్రాలతో పూజ ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. మహా శివరాత్రి రోజున ఆ దేవదేవునికి అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించేవారికి మరింత విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.