సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 18 జులై 2018 (18:05 IST)

రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకితే?

వృక్షములో రావిచెట్టు దేవతా వృక్షంగా చెప్పబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే పవిత్రమైన భావన కలుగుతుంది

వృక్షములో రావిచెట్టు దేవతా వృక్షంగా చెప్పబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే పవిత్రమైన భావన కలుగుతుంది. విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఆకులతో గలగలమంటూ అదిచేసే ధ్వని మనస్సుకు  ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.


దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తుంటుంది. రావిచెట్టు అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయ ప్రదక్షణలు చేసి పూజించడం వలన ఆ కోరికలు తప్పక నెలవేరుతాయని విశ్వసిస్తుంటారు.
 
ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. అలాంటి రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని చెప్పబడుతోంది. ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమై ఈ వృక్షాన్ని తాకవచ్చని స్పష్టం చేయబడుతోంది.