శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (13:40 IST)

పూజ గది తలుపులు ఎప్పుడు వేయాలంటే?

ప్రాచీనకాలం నుండి ప్రతి ఇంట్లోను పూజ మందిరాలు ఉంటూ వస్తున్నాయి. వంట గదికి పక్కనే ఈ పూజ మందిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇటీవల కాలంలో పూజ మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా

ప్రాచీనకాలం నుండి ప్రతి ఇంట్లోను పూజ మందిరాలు ఉంటూ వస్తున్నాయి. వంట గదికి పక్కనే ఈ పూజ మందిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇటీవల కాలంలో పూజ మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది.
 
ఉదయం వేళలోను, సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత వెంటనే పూజ గది తలుపులు వేయకూడదు. దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని శాస్త్రం చెబుతోంది.
 
కొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే దీపారాధన ఉన్నంత వరకు తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని అంటోంది. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని చెప్పబడుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలుగదు.