మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (12:33 IST)

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేస్తే?

జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివాటిని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండడం అవసరమే అయినా డబ్బు కూడా కావలసిందే. డబ్బు అసరాలను తీర్చడమే కాదు, ఆపదల నుండి గట్టెక్కించడమే కాదు, ఆత్మాభి

జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివాటిని ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా ఉండడం అవసరమే అయినా డబ్బు కూడా కావలసిందే. డబ్బు అసరాలను తీర్చడమే కాదు, ఆపదల నుండి గట్టెక్కించడమే కాదు, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు కూడా లక్ష్మీదేవి వస్తుంది. గౌరవ మర్యాదలు ఉన్నావారు సైతం ఓ పది రూపాయలు అడిగితే చాలు లోకువైపోతుంటాం.
 
అందువలన డబ్బు విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటి డబ్బు రావడం, నిలవడం లక్ష్మీదేవి అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనునిత్యం లక్ష్మీదేవి సన్నిధిలో దీపారాధన చేయడం వలన ఆ తల్లి అష్టోత్తరం గాని, సహస్ర నామాలు గాని పఠించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
 
లక్ష్మీదేవి నామస్మరణ వలన దారిద్య్రం తొలగిపోవడమే కాకుండా శారీరకపరమైన మానసిన పరమైన బాధలు కూడా తొలగిపాతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.