మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 11 జులై 2018 (11:37 IST)

రుద్రాక్షమాలను ధరిస్తే? దోషాలు తొలగిపోవడానికి?

రుద్రాక్షను పరమశివుడి స్వరూపంగా చెబుతుంటారు. సాక్షాత్తు సదాశివుడే రుద్రాక్షలో నివాసముంటాడని అంటారు. అలాంటి రుద్రాక్షను తాకడం వలనే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాలను ధరిం

రుద్రాక్షను పరమశివుడి స్వరూపంగా చెబుతుంటారు. సాక్షాత్తు సదాశివుడే రుద్రాక్షలో నివాసముంటాడని అంటారు. అలాంటి రుద్రాక్షను తాకడం వలనే సమస్త పాపాలు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ మాలను ధరించడం వలన అనేక బాధలు, దోషాలు తొలగిపోతాయి. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి.
 
శని ప్రభావం కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్లు రుద్రాక్షమాలతో జపం చేసుకోవడం వలన మంటి ఫలితాలను పొందవచ్చును. ఎవరైతే రుద్రాక్షమాలను ధరిస్తారో అలాంటివారికి దుష్టశక్తులు దూరంగా ఉంటాయి. రుద్రాక్ష మాల పవిత్రతను కాపాడుతున్నంత వరకు అది మహాశక్తివంతంగా తన ప్రభావాన్ని చూపుతుందన్నదే మహర్షుల మాట. 
 
అందువలన రుద్రాక్షను పరమ పవిత్రంగా చూసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో రుద్రాక్షమాలతో జపం చేసుకోవాలి. అప్పుడు ఒక రక్షఆ కవచంలా తనని ధరించినవారిని అది రక్షిస్తూ ఉంటుంది.