1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Amala Paul upset over Ex-Husband Getting Ready For Second Marriage

మాజీ భర్తకు రెండో పెళ్లి.. బెంగ పెట్టుకుని షూటింగ్‌కు డుమ్మాకొట్టిన భామ!!

మలయాళ కపుల్స్ అమలా పాల్ - విజయ్. సినీ ఇండస్ట్రీకి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కెరీర్‌లపై దృష్టిసారించారు

Amala Paul
మలయాళ కపుల్స్ అమలా పాల్ - విజయ్. సినీ ఇండస్ట్రీకి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ కెరీర్‌లపై దృష్టిసారించారు. ముఖ్యంగా అమలా పాల్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే, విజయ్ కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో విజయ్‌కు రెండో పెళ్లి చేసేందుకు ఆయన తల్లిదండ్రులు అమ్మాయిని వెతికే పనిలో నిమగ్నమైనట్టు వార్తలు వచ్చాయి. దాంతో త్వరలోనే విజయ్ పెళ్లి జరగనుందనీ.. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
 
ఈ వార్తలువిన్న అమలాపాల్ బెంగ పెట్టుకుందట. తీవ్రమనస్తాపానికి లోనైన అమలాపాల్... ఏకంగా షూటింగ్ నుంచి హఠాత్తుగా వెళ్లిపోయిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. తన మాజీ భర్త విజయ్ గురించి అమలా పాల్ ఇంకా ఆలోచన చేస్తున్నట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. 
 
ఈ వార్తలపై విజయ్ కూడా స్పందించారు. తన రెండో పెళ్లి విషయంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పాడు. పత్రికలు తన రెండో పెళ్లి గురించి రాసేముందు తనని ఒక మాట కనుక్కుని వుంటే బాగుండేదంటూ అసహనాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం తన దృష్టి కెరియర్‌పై మాత్రమే ఉందంటూ స్పష్టంచేశాడు. 
About Writer
pnr
తర్వాతి కథనం
మనిషికి ఆ సామర్థ్యం వుంది.. జుట్టు కత్తిరించుకున్నాను.. సోనాలీ బింద్రే