గీత గోవిందం.. #InkemInkemInkemKaavaale సాంగ్ మీ కోసం.. (వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ''గీత గోవిందం'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున

selvi| Last Updated: మంగళవారం, 10 జులై 2018 (14:42 IST)
టాలీవుడ్ యంగ్ హీరో తాజాగా ''గీత గోవిందం'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం గీత గోవిందం సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 
 
ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్‌.. జూలై పదో తేదీన తొలిపాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌‌గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను వీడియో ద్వారా ఓ లుక్కేయండి. 
 దీనిపై మరింత చదవండి :