అర్జున్ రెడ్డి తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు..

చిన్ని బడ్జెట్‌లో సినిమాలు తీయడంలో సురేష్ బాబు దిట్ట. ప్రస్తుతం ''అర్జున్ రెడ్డి'' తమ్ముడితో సురేష్ బాబు ఓ చిత్రం చేసేందుకు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. లో-బడ్జెట్ సినిమాల్లో కొత్

selvi| Last Updated: మంగళవారం, 3 జులై 2018 (12:46 IST)
చిన్ని బడ్జెట్‌లో సినిమాలు తీయడంలో సురేష్ బాబు దిట్ట. ప్రస్తుతం ''అర్జున్ రెడ్డి'' తమ్ముడితో సురేష్ బాబు ఓ చిత్రం చేసేందుకు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. లో-బడ్జెట్ సినిమాల్లో కొత్త హీరోలను పరిచయం చేసేందుకు సురేష్ బాబు ఎప్పుడూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే సురేష్ బాబు చిత్ర సమర్పణలో ఉయ్యాల జంపాలా(రాజ్ తరుణ్), తను నేను (సంతోష్ శోభన్) వంటి చిత్రాలు, నిర్మాతగా తాజా సినిమా ''ఈ నగరానికి ఏమైంది'' చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
ప్రస్తుతం అర్జున్ రెడ్డి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నారని.. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటుందని టాక్. తెలంగాణ నేపథ్యంలో కొత్త కుర్రాడు మహేంద్ర దర్శకత్వంలో ''దొరసాని'' అని ఓ ప్రేమకథను సినిమాగా తీయనున్నాడని.. అందులో హీరోగా ఆనంద్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 
 
అతడి సరసన ఓ నటుని కుమార్తె కథానాయికగా పరిచయం చేస్తారని సమాచారం. హీరోగా తనకు ఫస్ట్ హిట్ ''పెళ్లి చూపులు'' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన సురేశ్‌బాబుతో తమ్ముడిని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.దీనిపై మరింత చదవండి :