ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (13:13 IST)

అన్నాచెల్లెళ్లు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఆత్మహత్యకు?

ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు

ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు. కానీ వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియరావడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు బుధవారం స్కూలుకు వెళ్ళి తిరిగొస్తూ... తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు.