1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Avocado health benefits for eyes and brain

ప్రతిరోజూ అవకాడో తీసుకుంటే? కంటికి?

సీనియర్ సిటిజన్స్‌కు అవకాడో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండును రోజూ తీసుకుంటే వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరునెలల పటాు క్రమం తప్

avocado
సీనియర్ సిటిజన్స్‌కు అవకాడో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండును రోజూ తీసుకుంటే వృద్ధుల కంటి ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఆరునెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజూ అవకాడోను తీసుకుంటే వృద్ధుల కళ్లల్లో ల్యుటిన్ ప్రమాణాలు పెరుగుతాయి.
 
దాంతో మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ల్యుటిన్ పండ్లలో, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వలన పెరిగిన ల్యుటిన్ మెదడు, రక్తం, కళ్లల్లోకి  చేరుతుంది. ఇది యాంటి ఇన్‌ఫ్లమేటరీ ఏజెంటు మాత్రమే కాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌గా సహాయపడుతుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రతా శక్తి పెరగడాన్ని కూడా గుర్తించారు.
 
అవకాడో తీసుకోని వారిలో కాగ్నిటివ్ సామర్థ్యం పరిమితంగానే పెరగుడాన్ని కూడా పరిశోధకులు గమనించారు. మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికే కాకుండా కంటి ఆరోగ్యానికి కూడా అవకాడో చాలా ఉపయోగపడుతుంది. సప్లిమెంట్స్ కన్నా తాజా అవకాడోలు తీసుకున్న వాళ్ల కళ్లల్లో ల్యుటిన్ ప్రమాణాలు రెట్టింపుగా ఉంటాయి. వృద్ధుల కంటిని, మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు అవకాడో దివ్యౌషదంగా సహాయపడుతుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
దంతాలను తాజాగా వుంచే పండ్లు, పదార్థాలు