మంగళవారం, 3 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (09:36 IST)

గరిడేపల్లి అయ్యప్పస్వామి మహిమలు....

అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం, శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ప్రతి గ్రామం నుండి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడ

అయ్యప్పస్వామి లీలా విశేషాలు అనేకం. అందుకే భక్తులు ఆయన దీక్షను తీసుకోవడం, శబరిమలకు వెళ్లి జ్యోతి దర్శనం చేసుకోవడం చేస్తుంటారు. ప్రతి గ్రామం నుండి ఆయన దర్శనం కోసం వెళ్లే భక్తులు, ఆ స్వామి భజనలు చేసుకోవడానికి అభిషేకాదులు జరిపించుకోవడానికి గాను ఆయన ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు.
 
అలా భక్తులంతా కలిసి నిర్మించుకున్న అయ్యప్పస్వామి ఆలయాలలో ఒకటి గరిడేపల్లి. నల్గొండ జిల్లాలోని ఓ మండల కేంద్రంగా ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ ఊళ్లో చాలాకాలం నుండి రామాలయం ఉంది. ప్రాచీనకాలం నాటి శివలింగం ఒకడి బయటపడగా ఆ శివలింగానికి కూడా ఆలయాన్ని కట్టించారు. 
 
అలా శివకేశవుల ఆలయాలు అలరారుతుండగా ఇటీవలే అయ్యప్పస్వామి ఆలయాన్ని కూడా నిర్మించుకున్నారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తు ఉంటుంది. స్వామి దర్శనం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అయ్యప్పస్వామి ఆరాధన అన్ని శుభాలను కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.