మంగళవారం, 16 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 19 జులై 2018 (17:39 IST)

ప్రదక్షణలు వేయడం వలన ఫలితం ఏంటో?

దేవాలయానికి ఎప్పుడు వెళ్లినా కాస్తంత తీరిక చేసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనస్సులో భగవంతుడిని నిలుపుకోవడానికి ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షణలు చేయడానికి కనులారా దైవాన్ని దర్శిచండాని

దేవాలయానికి ఎప్పుడు వెళ్లినా కాస్తంత తీరిక చేసుకుని వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనస్సులో భగవంతుడిని నిలుపుకోవడానికి ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రదక్షణలు చేయడానికి కనులారా దైవాన్ని దర్శిచండానికి తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత కాసేపు అక్కడ కూర్చుని భగవంతుడిని తలచుకోవడానికి కొంత సమయం అవసరమవుతుంది.
 
కొంతమంది పనుల ఒత్తిడి కారణంగా వెంటనే తిరిగ వెళ్లి పోవాలనే ఉద్దేశంతో ప్రదక్షణలు చేయకుండానే నేరుగా ముఖమండపంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటుంటారు. ప్రదక్షణ వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయని, విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ప్రదక్షణలు చేయనివాళ్లు పాపాలను ప్రక్షాళన చేసుకునే అవకాశాన్ని, పుణ్యఫలాలను అందుకునే అదృష్టాన్ని కోల్పోయినట్లవుతుంది.
 
అందువలన ఆలయానికి వెళ్లగానే కాళ్లు కడుక్కుని నీరు పుక్కిలించి తలపై కాసిన్ని నీళ్లు చల్లుకుని ముందుగా ప్రదక్షణలు చేయాలి. అడుగుల శబ్దం రాకుండా నిదానంగా ప్రదక్షణలు పూర్తిచేసిన తరువాతనే దైవదర్శనం చేసుకోవాలి. భగవంతుడి సన్నిధిలో నిలబడే అర్హతను ప్రసాదించేవి ప్రదక్షణలేననే విషయాన్ని ఎప్పటికి మరచిపోకూడదు.