బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (10:59 IST)

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం : శ్రీవారి ఆలయం మూసివేత.. ఎపుడు?

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన, అద్భుతమైన చంద్రగ్రహణం జూలై 27వ తేదీన ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం గంటా 45 నిమిషాల పాటు కొనసాగనుంది. చంద్రగ్రహణం కారణంగా భూగ్రహ ఛాయలు అదృశ్యం కాకుండా.. పరావర్తనం చెందిన సూర్య కిర

ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన, అద్భుతమైన చంద్రగ్రహణం జూలై 27వ తేదీన ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం గంటా 45 నిమిషాల పాటు కొనసాగనుంది. చంద్రగ్రహణం కారణంగా భూగ్రహ ఛాయలు అదృశ్యం కాకుండా.. పరావర్తనం చెందిన సూర్య కిరణాల వల్ల పూర్తిగా ఎరుపు రంగు వర్ణంలోనే చంద్రుడు కనిపించనున్నాడు. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. ఆ సమయంలో భూమి చుట్టూ నీడలు ఏర్పడతాయి.
 
అంతేకాదు భూమికి దగ్గరగా వస్తున్నందున.. అంగారకుడు అదే రోజున సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి, చంద్రుడికి చాలా దూరంగా ఉన్న అంగారక గ్రహాన్ని కూడా ఆ రోజు చూసే అవకాశం లభించనుంది. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమికి దగ్గరగా వస్తాడు అంగారకుడు. ఈసారి మాత్రం స్పష్టంగా కనిపించనున్నాడు. మొత్తానికి ఆకాశంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు అంద‌రు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 
 
ఈ చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేదీ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారుజాము 4.15 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నారు. 27వ తేదీ రాత్రి 11.45 గంటల నుంచి 28న తెల్లవారుజామున 3.49 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉంటాయని… గ్రహణం పట్టే సమయానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలు మూసివేయటం ఆనవాయితీ. 
 
గ్రహణం తర్వాత ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ తర్వాత శుద్ధి, పుణ్యవచనం వంటి కార్యక్రమాలు ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తర్వాత తోమాల, కోలువు, పంచాంగశ్రవణం, అర్చణ వేవలను ఏకాంతంగంగా నిర్వహిస్తారు. 28న స్వామివారికి ఉదయం సేవలు పూర్తయ్యాక ఉదయం 7 గంటల తర్వాతే సర్వదర్శనం ఉంటుంది. అంతకుముందు రోజు 27న శ్రీవారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, గరుడవాహన సేవలను టీటీడీ రద్దు చేసింది.