గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 11 జులై 2018 (12:03 IST)

పండుగ రోజుల్లో మామిడి తోరణాలు ఇంటికి కట్టుకుంటే?

వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. అలా కాకుంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇం

వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. అలా కాకుంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో  పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది.
 
పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం నాడు లేదంటే శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతిరోజూ చేస్తే మంచిది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి.
 
స్నానం చేయకుండా, అపరిశుభ్రమైన దుస్తులతో కాళ్లు కడుక్కోకుండా పూజగదిని తెరవరాదు. దేవుళ్ల ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తరువాత దేవుళ్ల ప్రతిమలకు లేదా పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కళకళలాడితే అంతగా మన జీవితాలు కళకళలాడుతాయని పండితులు చెప్పుతున్నారు.
 
వీలైనంతవరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకానీ సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుళ్ళ ఫోటోలతో పూజామందిరాన్ని నింపడం మంచిది కాదని పెద్దల మాట.