గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (09:40 IST)

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని ఇలా కట్టుకుంటే?

వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వాస్తువరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి. కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్

వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వాస్తువరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి. కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలి.
 
ఇంటి నిర్మాణం కోసం ముందుగా స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని తవ్వాలి. ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి. అనంతరం నైరుతి దిక్కున చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. 
 
వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. 
 
మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండకపోవడం ఉత్తమం. ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఎలాంటి కట్టడం నిర్మించొద్దు. ఇంటి స్థలానికి పడమరం వైపున్న గోడను ఆనుకుని ఎలాంటి కట్టడానికి సంబంధించిన గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ భాగంలో పశువుల పాక, ధాన్యం నిల్వ చేసే గదుల నిర్మాణం లాభదాయకం. కాకపోతే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పుదిశగా వాలుగా ఉండాలి. లేదంటే స్త్రీలలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.