ఇంట్లో దుర్వాసన వస్తుందా? అయితే, ఇలా చేయండి...
సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. సూర్యరశ్మి లేకపోవడంతో నేలంతా చిత్తడిగా మారడం, ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో ఇల్లు దుర్వాసన వస్తుంది. అయితే, ఈ దుర్వాసన పోగొట్టేందుకు చ
సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. సూర్యరశ్మి లేకపోవడంతో నేలంతా చిత్తడిగా మారడం, ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో ఇల్లు దుర్వాసన వస్తుంది. అయితే, ఈ దుర్వాసన పోగొట్టేందుకు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.
* వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత కిటీకీలు, తలుపులు మూయకండి. వాటిని వీలైనంత వరకు తెరిచే ఉంచండి. దీంతో ఇంట్లో ఉన్న దుర్వాసన దాదాపుగా తగ్గిపోతుంది. ఇలాచేస్తే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి. ఈ వెలుగు సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. బాత్రూం, వంటిట్లో నాణ్యమైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ని విధిగా అమర్చాలి.
* వంటింట్లో వాసనలు తొలగాలంటే కాసిన నీటిలో నిమ్మకాయ తొక్కలను వేసి మరిగించాలి. ఇవి ఇల్లంతా వ్యాపించి మంచి వాసనను ఇస్తాయి. వేడినీటిలో నారింజ తొక్కలను వేసి మరిగించండి. ఇల్లంతా నారింజ వాసనలతో గుభాళిస్తుంటుంది.
* ఇంటిచుట్టూ బేకింగ్ పౌడర్‌ని జల్లితే ఈగలు ఇంట్లోకి రావు. అలాగే, మీకు నచ్చిన పెర్ఫ్యూమ్‌ను వెదజల్లితే మంచిది.
* కార్పెట్లు వాసన రాకుండా వాటిని బేకింగ్ సొడా కలిపిన నీటిలో నానబెట్టి వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరచండి. దీంతో కార్పెట్ల నుంచి మగ్గిపోయిన వాసన రాదు.