శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : శనివారం, 7 జులై 2018 (16:27 IST)

పూజ గదిలో దక్షిణం వైపున పటాలు పెట్టుకోవచ్చా?

చాలా మంది పూజ గదిలో తమకు తోచిన దిక్కున దేవుని పటాలను పెడుతుంటారు. ఈశాన్యం వైపు పూజ గదిని పెట్టుకుని దేవుని పటాలు దక్షిణం వైపుకు చూసేలా పెడతారు. ఇలా దక్షిణం వైపున పటాలు పెట్టుకోవచ్చా అనే అంశంపా వాస్తు

చాలామంది పూజ గదిలో తమకు తోచిన దిక్కున దేవుని పటాలను పెడుతుంటారు. ఈశాన్యం వైపు పూజ గదిని పెట్టుకుని దేవుని పటాలు దక్షిణం వైపుకు చూసేలా పెడతారు.

 
ప్రధానంగా ఇంటికి పూజ గది నిర్దిష్టమైన స్థలంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈశాన్యం వైపున సింహ ద్వారం పెట్టుకుని దాని పక్కనే పూజ గదిని నిర్మించడం సరికాదని అంటున్నారు. ఎపుడైనా పూజ గదిని ఉత్తరంలోగాని, తూర్పు వైపున గానీ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణలు సూచిస్తున్నారు. 
 
అలాగే పూజ గదిలో దేవుని పటాలు తూర్పు వైపుగానీ, పడమర వైపుగానీ పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అంటే మనం పూజించేటప్పుడు మన ముఖం తూర్పు వైపుగానీ, పడమర వైపుగానీ ఉండేలా చూసుకోవాలని సూచన చేస్తున్నారు.