శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (18:17 IST)

నమితా ఆచార్యతో హీలింగ్... ఇంద్రపాల్ బదిలీ.. యూనిఫామ్‌లో ఇలా చేయడం?

దేవీమాతగా చెప్పుకునే నమితా ఆచార్య ఇది వరకు పలువురు ప్రభుత్వాధికారుల కార్యాలయాలకు వెళ్లి హీలింగ్ చేసేవారు. వారిలో ఎక్కువగా ఐపీఎస్ అధికారులు వున్నారు. తాజాగా నమితా ఆచార్య ఢిల్లీలోని జానక్‌పురి పోలీస్‌ స

దేవీమాతగా చెప్పుకునే నమితా ఆచార్య ఇది వరకు పలువురు ప్రభుత్వాధికారుల కార్యాలయాలకు వెళ్లి హీలింగ్ చేసేవారు. వారిలో ఎక్కువగా ఐపీఎస్ అధికారులు వున్నారు. తాజాగా నమితా ఆచార్య ఢిల్లీలోని జానక్‌పురి పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జిగా పనిచేస్తున్న ఇంద్రపాల్‌ హీలింగ్ చేసి అతనికి వివాదాన్ని కొనితెచ్చి పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంద్రపాల్ నమితా ఆచార్యతో హీలింగ్‌ చేయించుకుంటూ, దీవెనలు పొందుతున్న ఫొటో వైరల్‌ కావడంతో అధికారిని బదిలీ చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని జానక్‌పురి పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జిగా పనిచేస్తున్న ఇంద్రపాల్... ప్రస్తుతం ప్రాధాన్యత లేని ఓ పోస్టుకు బదిలీ అయ్యారు. ఇందుకు యూనిఫామ్ ధరించిన ఇంద్రపాల్ కళ్లు మూసుకుని కూర్చోగా... సాధ్వి నమిత ఆచార్య ఆయన వెనుక నిలబడి, తలపై చేతులుంచి ఆశీర్వదిస్తున్నట్టు గల ఫోటోనే కారణం. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.
 
ఈ ఫొటో కాస్తా వైరల్‌గా మారడంతో.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులే ఇలా ఏకంగా పోలీస్ స్టేషన్‌లో అది కూడా యూనిఫాంలో ఇలా చేయడమేమిటని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇందర్‌ పాల్‌ను ఆదేశిచండంతో పాటు విజిలెన్స్‌ ఎంక్వైరీని కూడా ఏర్పాటు చేశారు. అతడిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.