సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (09:58 IST)

బాలయ్య మనవడికి ఏం పేరు పెట్టారో తెలుసా?

నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. శ్రీభరత్ గీతమ్ విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తికి మనవడైన భరత్‌కు హిందుపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస

నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. శ్రీభరత్ గీతమ్ విద్యాసంస్థల అధినేత ఎంవివిఎస్ మూర్తికి మనవడైన భరత్‌కు హిందుపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సినీ హీరో, నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్వినికి వివాహమైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మార్చిలో బాబు పుట్టాడు. 
 
ప్రస్తుతం ఆ బుల్లిబాబుకు నామకరణం చేసే వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నేపథ్యంలో తేజిస్విని కుమారుడి ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. బాలయ్య మనవడికి ఆర్యవీర్ అనే పేరు పెట్టారు. ఈ వేడుకలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.