సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జులై 2018 (15:45 IST)

మద్యం తాపించి.. చేతులు గట్టిగా పట్టుకుని.. పక్కగదిలోకి తీసుకెళ్లి...

అంకుల్.. అంకుల్ అంటూ చిన్నప్పటి నుంచి ముద్దుగా పిలిచిన వ్యక్తి ఓ కామాంధుడని ఆ యువతి గ్రహించలేకపోయింది. తన స్నేహితురాలిని చూసేందుకు వెళ్లిన ఆ యువతిపై అంకుల్ అని పిలుస్తూ వచ్చిన వ్యక్తే లైంగికదాడికి పాల

అంకుల్.. అంకుల్ అంటూ చిన్నప్పటి నుంచి ముద్దుగా పిలిచిన వ్యక్తి ఓ కామాంధుడని ఆ యువతి గ్రహించలేకపోయింది. తన స్నేహితురాలిని చూసేందుకు వెళ్లిన ఆ యువతిపై అంకుల్ అని పిలుస్తూ వచ్చిన వ్యక్తే లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీకూడా మద్యం తాపించి మరీ అత్యాచారం చేశాడు. కన్నబిడ్డ పక్క గదిలో నిద్రపోతుంటే.. మరో గదిలో ఆమె స్నేహితురాలిని తీసుకెళ్లి రేప్ చేశాడు ఆ కామాంధుడు. ఈ దారుణం ఢిల్లీకి సమీపంలోని గుర్‌గ్రామ్‌లో వెలుగు చూసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, భారత్, కెనడా దేశాల్లో డెంటల్ ఇంప్లాంట్స్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి సుహానా రోడ్‌లో నివసిస్తున్నాడు. అతని కుమార్తెకు ఆ దగ్గరలో ఉండే బాధితురాలు ఎనిమిదో తరగతి నుంచి స్నేహితురాలు. ఆమె తరచూ వ్యాపారి ఇంటికి వచ్చి వెళ్లేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన కుమార్తె, బాధితురాలితో కలసి సైబర్ హబ్‌కు డిన్నర్‌కు వెళ్లాడు. తన కుమార్తెతో పాటు, బాధితురాలితో మద్యం తాగించాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముగ్గురూ ఇల్లు చేరారు.
 
కుమార్తె గదిలో బాధితురాలు నిద్రిస్తుండగా, అతను వచ్చి లేపి, చేతులు గట్టిగా పట్టుకుని, పక్క గదిలోకి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తెల్లారిన తర్వాత, తన స్నేహితురాలికి విషయం చెప్పి, ఆమె సాయంతో ఇంటికి చేరిన ఆమె, తల్లితో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. 
 
కాగా, బాధితురాలే స్వయంగా తన గదికి వచ్చిందని, తాను ఎలాంటి బలవంతం చేయలేదని సదరు కామాందుడు కోర్టు ముందు పేర్కొనడం గమనార్హం. అతని భార్య కూడా అతనికే వత్తాసు పలుకుతోంది. తమ కుటుంబ పరువు తీసేందుకు ఈ పని చేస్తున్నారని వాపోయింది. న్యాయ విద్యార్థిని తండ్రి కూడా తన భర్త చేస్తున్న వ్యాపారమే చేస్తున్నాడని, ఆయనకు పోటీగా వస్తున్నందుకు కుమార్తెతో ఈ ఆరోపణలు చేయించాడని ఆరోపించింది.