సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జులై 2018 (11:41 IST)

రాముడు కూడా అత్యాచారాలను ఆపలేడు : బీజేజీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆ శ్రీరాముడు కూడా ఆపలేడనీ, పైగా అది సహజమని వ్యాఖ్యానించారు.
 
రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్‌ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ, మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరూ మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలమని వ్యాఖ్యానించారు. 
 
కాగా, ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలు నయమని గతంలో ఈయనగారు సెలవిచ్చారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారంటూ వ్యాఖ్యానించారు.