శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (13:09 IST)

సెల్ఫీ దిగితే ఎఫైర్ అంటగట్టేస్తున్నారు.. జగన్ బంగ్లా కట్టించారా? : అలేఖ్య ఏంజెల్

నటి అలేఖ్య ఏంజెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న పేరు. వైసీపీ అధినేత జగన్‎తో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నందుకు ఇపుడు ఆమె ఎందరికో టార్గెట్‌గా మారిపోయింది. జగన్‌కు, ఆమెకు మధ్య సమ్‌థింగ్, స

నటి అలేఖ్య ఏంజెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న పేరు. వైసీపీ అధినేత జగన్‎తో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నందుకు ఇపుడు ఆమె ఎందరికో టార్గెట్‌గా మారిపోయింది. జగన్‌కు, ఆమెకు మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆకతాయిలు తమకు ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.
 
దీనిపై అలేఖ్య ఏంజెల్ స్పందిస్తూ, 'ఓ సీడీ లాంచ్ కోసం 2017 ఫిబ్రవరిలో జగన్‎ని కలిశా. ఆ సమయంలో నేను మామూలుగా ఓ సెల్ఫీ దిగా. ఆ రోజే సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. ఆ సెల్ఫీని పట్టుకుని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ వల్ల నాకు, నా ఫ్యామిలీకి చాలా కాల్స్ వచ్చాయి. జగన్‌ని దూషించడం కోసం నన్ను వివాదంలోకి లాగడం చాలా చాలా తప్పని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
అంతేకాకుండా, అదే ఓ మామూలు అమ్మాయి అయి ఉంటే పరిస్థితి ఏంటి?. పెళ్లి జరగబోయే సమయం కావచ్చు. ఈ ట్రోల్ వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం కాదా?. అలాంటి చిన్న ఆలోచన కూడా చేయకుండా ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్. నన్ను, నా ఫ్యామిలీని, జగన్‏ని బ్లేమ్ చేయడం నాకు నచ్చలేదని ఆమె వాపోయింది. 
 
ఇకపోతే, పవన్‎కి నేను అభిమానిని. ఇలా ట్రోల్ చేయొద్దని పవన్ అభిమానులను కోరా. అయినా ట్రోల్స్ ఆగడం లేదు. ఇప్పటివరకు లక్ష షేర్లు దాటాయి. కొంతమంది పవన్ ఫ్యాన్స్ నాకు సారీ చెప్పారు. మా అన్న మీద ఉన్న అభిమానంతో ఇలా చేశామని చెప్పారు. పవన్ అంటే నాకూ ఇష్టమే. పవన్‌కున్న మానవత్వం కూడా మీకు గుర్తుకు రాలేదా అని అడిగా. పదిమందికి సాయం చేయండి... ఒక అమ్మాయిని తీసుకొని బదనాం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పా. ఇంకా కొంతమంది ఇంకా ఇంకా ట్రోల్ చేస్తున్నారు. చేయని తప్పు, నేరానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అనుకోలేదుని వివరించింది.
 
ఒక్క సెల్ఫీతో ఇంత దారుణంగా ట్రోల్ చేసి, నన్ను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇంతదారుణంగా సమాజం తయారయిందా అనిపిస్తోంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఒక అమ్మాయి ఎందుకు సెల్ఫీ దిగింది, ఏంటి అనేది కూడా అలోచించడం లేదు. ఎఫైర్ అంటగట్టేస్తున్నారు. ఒక కామెంట్‌లో షాజహాన్‌ ముంతాజ్‌కి తాజ్‌మహల్ కట్టించారు.. అలేఖ్యకి జగన్ బెంగళూరులో బంగ్లా కట్టించారని రాశారు. ఇలాంటివి చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థంకావడంలేదు. బలవంతుడే భరించగలడు అని పవన్ కల్యాణే చెప్పాడు. అందుకే నేనూ భరిస్తున్నా. అయినా వాళ్లకు కొంచెం కూడా జాలి కలగడంలేదు' అని వ్యాఖ్యానించారు.