బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (11:04 IST)

దేశంలోనే తొలిసారి... హైదరాబాద్‌లోనే ఏర్పాటు.. ఏంటది?

దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం ఓ స్పా కేంద్రాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేశారు. దైనందిన జీవితంలో నిత్యమూ పని ఒత్తిడితో అలసిపోతే, పెద్దలు ఎలాగైతే వారాంతం కోసం వేచి చూస్తుంటారో, చిన్న పిల్లలలోనూ అటువం

దేశంలోనే తొలిసారిగా చిన్నారుల కోసం ఓ స్పా కేంద్రాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేశారు. దైనందిన జీవితంలో నిత్యమూ పని ఒత్తిడితో అలసిపోతే, పెద్దలు ఎలాగైతే వారాంతం కోసం వేచి చూస్తుంటారో, చిన్న పిల్లలలోనూ అటువంటి ఒత్తిడే ఉంటుందట. హైడ్రో థెరపీ, మసాజ్, వ్యాయామంతో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని గుర్తించిన కొల్లా స్వాతి అనే ఔత్సాహికురాలు ఈ బేబీ స్పాను ఏర్పాటు చేసింది.
 
ఈ స్పా సెంటర్ చిన్నారుల్లో మానసిక ఉల్లాసం, వారి వృద్ధికి దోహదపడుతుందని, ఇక్కడ ఎన్నో రకాల స్పా సేవలను పిల్లల కోసం అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నారు. 'నెలల శిశువులకు ఈ స్పా ప్రత్యేకమైనది. 9 నెలల వయసు వరకూ ఉన్న వారికి ప్రత్యేక సేవలను అందిస్తాం. తల్లి గర్భంలో ఉన్న సమయంలో వారు అనుభవించి అనుభూతి చెందే సహజ పరిస్థితులను కల్పించాం. వారు లేచి నిలబడలేరు కాబట్టి, పడుకుని ఉంటూనే చేసే వ్యాయామం ఇంక్కడ అందుబాటులో ఉంది' అని స్పా సెంటర్ యజమానురాలు చెప్పుకొచ్చింది.