గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (19:00 IST)

మొబైల్ మార్కెట్లో ‘జియో ఫోన్’ జోరు... తెలుగు రాష్ట్రాల్లో హంగామా...

జియో ఫోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. 2018 సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్‌ కైవ‌సం చేసుకుంద‌ని సైబ‌ర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్య‌య‌నం తేల్చింది. `ఫ్యూజ‌న్ ఫోన్‌`

జియో ఫోన్ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. 2018 సంవ‌త్స‌రంలో మొద‌టి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్‌ కైవ‌సం చేసుకుంద‌ని సైబ‌ర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్య‌య‌నం తేల్చింది. `ఫ్యూజ‌న్ ఫోన్‌` పేరుతో నూత‌న కేట‌గిరీని జియో ఫోన్ సృష్టించింద‌ని ఈ నివేదిక‌ విశ్లేషించింది. 
 
4జీ క‌నెక్టివిటీ క‌లిగి ఉండి వినియోగ‌దారుల‌కు న‌ప్పే యాప్స్ ఎకోసిస్ట‌మ్‌తో ఫీచ‌ర్ ఫోన్ హ్యాండ్ సెట్‌లోనే పలు స్మార్ట్ ఫోన్ సౌలభ్యత‌ను కలిగి ఉందని వివరించింది. ఫ్యూజ‌న్ ఫోన్ల రాక‌తో 2018 రెండో త్రైమాసికం విస్ప‌ష్ట‌మైన మార్పును చ‌విచూసింది. ఈ త్రైమాసికంలో ఆ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకునేలా చేసింది జియో ఫోన్ కావ‌డం విశేషం.
 
2018 రెండో త్రైమాసికంలో స్వ‌ల్ప‌కాలంలో మార్కెట్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసిన రెండు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ``అందులో మొద‌టిది జియో ప్ర‌వేశ‌పెట్టిన సంచ‌ల‌న మాన్‌సూన్ ఆఫ‌ర్. ఈ ఆఫ‌ర్ వ‌ల్ల అన్ని ప్ర‌ముఖ‌ హ్యాండ్‌సెట్ల బ్రాండ్ల‌కు అనియ‌త‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. రెండో అంశం చిన్నత‌ర‌హా విభాగానికి చెందిన వారు సీకేడీ మాన్యూఫాక్చ‌రింగ్ వైపు దృష్టి సారించారు. దీంతోపాటుగా వారి సొంత ఎస్ఎంటీ లైన్ల ద్వారా ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కొన‌సాగించారు`` అని సీఎంఆర్ ఇండ‌స్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్ర‌భురామ్ తెలిపారు.
 
``దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా మొబైల్ బ్రాండ్స్, మొబైల్ హ్యాండ్‌సెట్ ర‌వాణ చార్జీలు 300 మిలియ‌న్ల ముద్ర‌ను 2018 చివ‌రి నాటికి దాటుకునేందుకు వేగంగా ముందుకు సాగుతోంది. దీంతోపాటుగా ఫీచ‌ర్ ఫోన్లు మ‌రియు ఫ్యూజన్ ఫోన్లు క‌లిపి 2020 నాటికి స్మార్ట్ ఫోన్ల‌ను దాటివేస్తాయి`` అని ఆ నివేదిక వెల్ల‌డించింది.
 
``రూ.4000 ధ‌ర‌కు మించిన 4జీ క‌నెక్టివిటీతో ఉన్న స్మార్ట్ ఫోన్లు దిగుమ‌తి చేయ‌బ‌డ్డాయి. ఎల్‌టీఈ సాంకేతిక‌త ఆధారంగా ప‌నిచేసే మొబైల్ ఫోన్లు గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో పోలిస్తే...104 శాతం వృద్ధి సాధించాయి`` అని ఆ నివేదిక స్ప‌ష్టం చేసింది.
 
తెలుగు రాష్ట్రాల్లో ‘మాన్‌సూన్ హంగామా’కు విశేష ఆదరణ
జియో ద్వారా ప్ర‌క‌టించ‌బ‌డిన ఎక్సేంజ్ స్కీమ్ అయిన `జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా`కు తెలుగు రాష్ర్టాల వినియోగ‌దారుల పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ క‌న‌బ‌ర్చారు. ఈ ఆఫ‌ర్ విప‌ణిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవ‌డ‌మే కాకుండా జియో ఫోన్ అమ్మ‌కాల‌లో విశేష వృద్ధి స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టిన కేవ‌లం ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌లాది జియోఫోన్ల అమ్మ‌కాలు జ‌రిగాయి.
 
జియోఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫ‌ర్‌లో భాగంగా వినియోగ‌దారులు ఏదైనా ఫీచ‌ర్ ఫోన్ (ఏ బ్రాండ్ కు చెందిన‌ది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ ( ప్ర‌స్తుతం ఉన్న మోడ‌ల్‌)ను తిరిగి చెల్లించే ప్రాతిప‌దిక‌న‌ కేవ‌లం రూ.501 సెక్యురిటీ డిపాజిట్ రుసుముతో పొంద‌వ‌చ్చు. వాస్త‌వ సెక్యురిటీ డిపాజిట‌ల్ రూ.1500 కాగా, ఈ ఆఫ‌ర్‌లో రూ. 999 త‌గ్గింపు కావ‌డం విశేషం. ఫీచ‌ర్ ఫోన్‌ను అందించే ఈ ప‌థ‌కంలో భాగంగా వినియోగ‌దారులు రూ. 594(రూ.99 x 6) చెల్లించ‌డం ద్వారా 6 నెల‌ల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ మ‌రియు డాటాను పొంద‌వ‌చ్చు. అంటే వినియోగ‌దారుడు రూ. 1,095 (రూ.501 తిరిగి చెల్లించే సెక్యురిటీ మొత్తం+ రూ.594 రీచార్జీ మొత్తం) చెల్లించ‌డం ద్వారా ఆరునెల‌ల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ మ‌రియు డాటాను అందించే జియో ఫోన్‌ను త‌మ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసి సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.