రూ.99కే 14 జీబీ - అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ కంపెనీ?
దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.
దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులోభాగంగా రూ.99 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. 14 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.
నిజానికి ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లతో కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. అలాగే, పాత కస్టమర్లకు సరికొత్త ఆఫర్లూ ఇస్తూ వస్తోంది.
తాజాగా జియో ఫోన్ వినియోగదారులకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.99 రీఛార్జ్ ప్యాక్‌తో 14 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందించేందుకు ముందుకు వచ్చింది. 28 రోజు కాలపరిమితో ఉండే ఈ ఆఫర్ కింది రోజుకు 0.5 జీబీ చొప్పు మొత్తం 14 జీబీ డేటాను ఇవ్వనుంది.
అలాగే, ఉచితంగా 300 ఎస్‌ఎంఎస్‌లకు కూడా అవకాశం ఉంది. అయితే ఇది కేవలం జియో ఫోన్లలో వాడే సిమ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో రూ.99 ఆఫర్ దాని మాన్సూన్ హంగామా ఆఫర్‌తో పాటు ఆవిష్కరించింది.