శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జులై 2018 (09:27 IST)

నేటి నుంచి "జియో" ఫోన్ మాన్ సూన్ ఆఫర్

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో "జియో మాన్‌సూన్ హంగామా" పేరిట ప్రకటించిన సరికొత్త ఆఫర్ జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌ను కంపెనీ 41 వార్షిక స

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో "జియో మాన్‌సూన్ హంగామా" పేరిట ప్రకటించిన సరికొత్త ఆఫర్ జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్‌ను కంపెనీ 41 వార్షిక సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే.
 
ఈ ఆఫర్ కింద వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పాత ఫీచర్ ఫోన్ ఇచ్చి జియో ఫోన్‌ని కేవలం రూ.501కు పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి ప్రస్తుత జియో ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. 
 
ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.501 చెల్లించి కొత్త జియో ఫోన్ పొందవచ్చు. అయితే, జియో మాన్ సూన్ ఆఫర్‌లో కొత్తగా ఫోన్ కొనాలంటే మాత్రం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్‌లో జియో ఫోన్ కావాలనుకునే కస్టమర్ల వైబ్‌సైట్‌‌లో తమ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్, మీ ప్రాంత పిన్ కోడ్ వివరాలను అందించాల్సి ఉంటుంది.
 
ఈ ఆఫర్ కింద అందించే జియో ఫోన్ 2 ఫీచర్లను పరిశీలిస్తే, 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.