ముంబైకు చెందిన విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్...

ముంబైకు చెందిన ఓ విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. యేడాదికి 1.2 కోట్ల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ విద్యార్థి పేరు ఆదిత్య పలివాల్. వయసు 22 యేళ్లు. ప్రస్తుతం ఆదిత్య బ

aditya
pnr| Last Updated: బుధవారం, 11 జులై 2018 (09:12 IST)
ముంబైకు చెందిన ఓ విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. యేడాదికి 1.2 కోట్ల వేతన ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ విద్యార్థి పేరు ఆదిత్య పలివాల్. వయసు 22 యేళ్లు. ప్రస్తుతం ఆదిత్య బెంగుళూరులోని ట్రిపుల్ ఐఐఐటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈయన గూగుల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన కంప్యూటర్‌ భాష కోడింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
 
ఈ పరీక్షకు వివిధ దేశాలకు చెందిన ఆరు వేల మంది పరీక్ష రాయగా, 50 మంది ఫైనల్ రౌండ్‌కి చేరుకున్నారు. వారికి కృత్రిమ మేధస్సు, టెక్నాలజీ పరిశోధన, అంశాలపై మరోసారి టెస్ట్ నిర్వహించగా… ఆదిత్య మొదటిస్థానంలో నిలిచారు. దీంతో యేడాదికి రూ.1.2 కోట్ల వేతనంతో ఉద్యోగం ఇస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. అలాగే, ఈనెల 16వ తేదీ నుంచి ఆదిత్య గూగుల్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సివుంది. దీనిపై మరింత చదవండి :