శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 12 జులై 2018 (17:44 IST)

ఇప్పుడు ప్రియాప్రకాష్‌ వారియర్ ఏం చేస్తోందో తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు?

ప్రియా వారియర్ గుర్తుంది కదా. ఆ మధ్య ఆమె పేరు దేశమంతా మారుమ్రోగింది. కనుసైగలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో నిర్మాతలందరూ ఆమె వెనుక పడ్డారు. కానీ కొన్నిరోజుల తరువాత ఆమె వెనుక పడటం మానేశారు. ఇప్పుడు యాడ్స్ పైనే దృష్టి పెట్టింది.

ప్రియా వారియర్ గుర్తుంది కదా. ఆ మధ్య ఆమె పేరు దేశమంతా మారుమ్రోగింది. కనుసైగలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో నిర్మాతలందరూ ఆమె వెనుక పడ్డారు. కానీ కొన్నిరోజుల తరువాత ఆమె వెనుక పడటం మానేశారు. ఇప్పుడు యాడ్స్ పైనే దృష్టి పెట్టింది. 
 
ఐదు నెలల క్రితం ప్రియావారియర్ పేరు మారుమ్రోగింది. ఎక్కడ చూసినా ఆమె గురించే డిస్కషన్. ఒక మలయాళం సినిమా టీజర్‌లో ఆమె కన్ను గీటిన సన్నివేశానికి ఇంటర్నెట్ ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఓవర్‌నైట్ ఈ టీనేజ్ అమ్మాయి సెలబ్రిటీగా మారిపోయింది. మలయాళంలోని ఒక సినిమాలో చిన్న పాత్రను పోషించింది ప్రియాప్రకాష్ వారియర్. ఆ వీడియోలోని రెండు సన్నివేశాలు బాగా వైరలయ్యాయి. 
 
ప్రియాప్రకాష్‌ వారియర్ నటించిన సినిమాను నిలిపివేసి మళ్ళీ రీషూట్ ప్రారంభించారట నిర్మాతలు. ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ కావడంతో ఆమెతో సినిమాలు చేయాలని టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు భావించారు. కానీ కుదరలేదు. త్వరలోనే పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో పడతాయన్న ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. అయితే ఆ తరువాత అయిదు నెలల దాటిపోయింది. కానీ ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమా కూడా ఆమె చేతిలో లేదు. దీంతో ప్రియా కనీసం యాడ్స్ లోనైనా నటించి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉందట. కానీ అందుకు అవకాశాలు రాకపోవడంతో ప్రియా ప్రకాష్‌ వారియర్ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్‌గా ఉంటోందట.