సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 11 జులై 2018 (13:09 IST)

మ‌హేష్ మూవీ ఫ‌స్ట్ లుక్‌కి ముహుర్తం ఫిక్స్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డెహ్ర‌డూన్‌లో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, పూజా హేగ్డే, అల్ల‌రి న‌రేష్‌ల పైన కాలేజ్ స‌న్న

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. డెహ్ర‌డూన్‌లో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, పూజా హేగ్డే, అల్ల‌రి న‌రేష్‌ల పైన కాలేజ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. త్వ‌ర‌లో తాజా షెడ్యూల్‌ను అమెరికాలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి రాజ‌సం అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌తంలో వార్త‌లు వచ్చాయి.
 
తాజాగా మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. రైతు బిడ్డ‌. ఇందులో రైతుల స‌మ‌స్య‌ల గురించి ఎక్కువ చ‌ర్చిస్తున్నార‌ట‌. అందుచేత రైతు బిడ్డ అనే టైటిల్ క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని ఈ టైటిలే ఫిక్స్ చేసార‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ & టైటిల్‌ను మ‌హేష్ పుట్టిన‌రోజైన ఆగ‌ష్టు 9న ఎనౌన్స్ చేస్తార‌ట‌. ఇక మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. మ‌రి.. టైటిల్ విష‌యంలో క్లారిటీ రావాలంటే ఆగ‌ష్టు 9 వ‌ర‌కు ఆగాల్సిందే.