శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : గురువారం, 12 జులై 2018 (17:38 IST)

RX 100 రివ్యూ రిపోర్ట్ ఎలా వుంది.. ఓ లుక్కేయండి..

కార్తీకేయ శివ పాత్రకు న్యాయం చేశాడు. నేచురల్ లుక్‌తో కనిపించాడు. నిజాయితీ గల ప్రేమికుడిగా, ప్రేమకు దూరమై మూర్ఖుడిలా మారిన యువకుడిలా రెండు వేరియన్స్‌ బాగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో కార్తి

సినిమా : ఆర్‌ఎక్స్‌ 100
జానర్ : రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్, రాంకీ తదితరులు 
సంగీతం : చైతన్‌ భరద్వాజ్‌
నిర్మాత : అశోక్‌ రెడ్డి గుమ్మకొండ
దర్శకత్వం : అజయ్‌ భూపతి 
 
చిన్న బడ్జెట్ మూవీగా తెరకెక్కిన సినిమా ఆరెక్స్ 100. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను సొంత చేసుకొన్న ఈ చిత్రం జూలై 12వ తేదీన రిలీజైంది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళ్తే.. 
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన శివ(కార్తికేయ)ను డాడీ(రాంకీ) అన్ని తానే అయి పెంచుతాడు. డాడీకి చేదోడు వాదోడుగా ఉంటూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు శివ. ఊళ్లో రాంకీకి,  విశ్వనాథం(రావు రమేష్)తో గొడవలు అవుతాయి. కానీ అదే సమయంలో శివ, విశ్వనాథం కూతురు ఇందు(పాయల్ రాజ్‌పుత్‌)తో ప్రేమ పడతాడు. 
 
తన ప్రేమకు డాడీ సపోర్ట్ చేయటంతో శివ, ఇందుకు మరింత దగ్గరవుతాడు. ఓ రోజు ప్రేమ విషయం ఇంట్లో చెప్తానని శివకు చెప్పిన వెళ్లిన ఇందు.. తండ్రి చూసిన ఫారిన్ అబ్బాయినే పెళ్లాడుతుంది. ఇంకా విదేశాలకు వెళ్లిపోతుంది. ఇందును తన నుంచి దూరం చేశాడని విశ్వనాథం మీద పగ పెంచుకుంటాడు శివ. విశ్వనాథం మనుషులను కొట్టడంతో పాటు, ఆస్తులను కూడా ధ్వంసం చేస్తూ సైకోలా తయారవుతాడు. అసలు ఇందు, శివను కాదని మరో పెళ్లి ఎందుకు చేసుకుంది..? వీరి ప్రేమకథలో విలన్‌ ఎవరు..? చివరకు శివ ఏమైయ్యాడు అన్నదే మిగిలిన కథ. 
 
విశ్లేషణ : దర్శకుడు అజయ్‌ భూపతి తన గురువు వర్మ లాగే ఒక వాస్తవిక కథను తెరపై చూపించడానికి ప్రయత్నించాడు. నిజ జీవితంలో జరిగిన కథను సినిమాగా రూపొందుంచాడు. తొలి సన్నివేశాలతో కాస్త బోర్‌ కొట్టించాడు. కథానాయిక రాకతో కథ, కథనంలో ఉత్సాహం వస్తుంది. కథానాయిక పాత్ర బోల్డ్‌గా తీర్చిదిద్దాడు. హీరో, హీరోయిన్ల మధ్య సాగిన రొమాన్స్ సీన్లు కాస్త డోస్ పెరిగినట్లనిపించాయి. 
 
ద్వితీయార్థం చూస్తే ''అర్జున్‌ రెడ్డి'' లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పతాక సన్నివేశాలు మరింత రియలిస్టిక్‌గా తీర్చిదిద్ది ఈ కథను విషాదాంత కోణంలో ముగించాడు. ప్రేమకథా చిత్రాల్లో ఇలాంటి కోణం చూడటం చాలా అరుదు.
 
నటీనటులు- కార్తీకేయ శివ పాత్రకు న్యాయం చేశాడు. నేచురల్ లుక్‌తో కనిపించాడు. నిజాయితీ గల ప్రేమికుడిగా, ప్రేమకు దూరమై మూర్ఖుడిలా మారిన యువకుడిలా రెండు వేరియన్స్‌ బాగా చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ ఫర్వాలేదనిపించింది. నటన పరంగా ఓకె అనిపించినా, గ్లామర్‌ షో, బోల్డ్‌ సీన్స్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. 
 
రావు రమేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రాంకీ నిరాశ పరిచారు. హీరోకు పెద్ద దిక్కుగా కనిపించిన రాంకీకి ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప పెద్దగా నటనకు అవకాశం దక్కలేదు. మొత్తానికి ఆర్ఎక్స్ 100 యూత్‌ను బాగానే ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. 
 
ప్లస్ పాయింట్స్:
హీరోయిన్ నటన, గ్లామర్
ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలపై రావు రమేష్ డైలాగ్స్..
రొమాన్స్ సన్నివేశాలు 
 
మైనస్ పాయింట్స్ 
తొలి అర్థభాగం
వినోదం కరువైంది
లిప్ లాక్ సీన్ల ఓవర్ డోస్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ 
 
రేటింగ్ -2.25/5